Tuesday, December 30, 2008

VAT వాతం

హెచ్చరిక-1: ఇది రాస్తుంది ఈ blog owner శశాంక్ ఒకడే కాదు ఇందులో BR పాత్ర చాలా వుంది. ఈ పోస్ట్ లో రాసిన విషయాలకు నేను నైతిక బాద్యత వహించడం లేదు.
హెచ్చరిక-2
: ఇక్కడ రాస్తున్న విషయాలు, రాతలు కల్పితం మాత్రం కాదు. నిజ జీవితం లో ఒక మనిషిని ఉద్దేశించి రాయబడినవి.

ఇక కథలోకి వస్తే అనగనగ ఒక V గడు (ఈ V గడు ఎవడ్రా అనే సందేహం మీకు రానే వస్తుంది. అతని గురించి నేను ఇది వరకు రాసిన "Golden Rules" అనే పోస్టు చదివుంటే మీకే తెలుస్తుంది), వాడికి ఎక్కడికో బైక్ మీద వెళ్ళాల్సిన అవసరం వచ్చింది.
సర్లే.. ఖాళీగానే వెళ్తున్నాం కదా, టైం పాస్ అవుతుందని వెనకాల "అమీర్పేట్ గర్ల్ ఫ్రెండ్" ఉన్నట్టు ఊహించుకుని గులాబీ సినిమాలోని మేఘాలలో తెలిపోమ్మన్నది... పాట ఏసుకుంటూ వెళ్తుండగా చీమకి కూడా హాని తలపెట్టని ఓ అమాయక (పాపం పొద్దున్నే ఎవరి ముఖం చూసాడో) ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒకడు మన V గాన్ని ఆపనే ఆపాడు. పాపం వాడు ఫీల్డ్ కి కొత్తాయే.. పెద్దగా యెక్స్పీరియెన్స్ లేదు. లంచం అడగాలా వద్దా? అడిగితే ఎంత ఆడగాలి? ఎలా అడగాలి? అన్న విషయాలు ఏవీ తెలియదు. మొత్తానికి మొహమాటాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఓ 100 రూపాయలు అడిగాడు. ఇద్దరూ కాసేపు చర్చించుకుని బేరం 50 కి కుదిర్చారు.
ఇంతలో మన V గాడి మనసులో ఓ డౌట్ రానే వచ్చింది. ఆ 50 రూపాయలు VAT include చేసా? చెయ్యకుండా? అని. ఓ నిమిషం థింకింగ్ సేసుకుని ఆ కానిస్టేబుల్ ని అడగనే అడిగేసాడు. పాపం కొత్త గుంటడు! ఈ బిజినెస్ కి కొత్త, కాపీ కొట్టి వచ్చాడు ఉద్యోగం లోకి, పైగా economics లో కుడా పెద్దగా టచ్ లేదు. వాడి ఖర్మ కాలి మన V గాన్ని "VAT అంటే ఏంటి?" అని అడగనే అడిగాడు. ఇంకేముంది... మన వాడు వాడికి economics లో crash-course ఓటి ఇవ్వనే ఇచ్చాడు. గత 395.34 రోజులుగా Economic Times, Websites లో నేర్చుకున్నదంతా కక్కేసాడు. పూర్ కానిస్టేబుల్ ది సున్నితమైన హృదయం... తట్టుకోలేక పోయింది. అక్కడే కింద పడిపోయి అప్పుడే aquarium లో నుంచి బయట పడ్డ చాపలా గిల-గిలా కొట్టేసుకున్నాడు. అల కొట్టేసుకుని కొట్టేసుకుని బోర్ కొట్టి స్పృహ లోకి ఒచ్చాడు. అప్పుడే మన వాడు ఏవో complicated mathematic calculations చేసి Rs.50/- కి VAT ఎంత అవుతుందో లెక్క కట్టి, డబ్బులు ఇచేసి అక్కడ్నుంచి ఒచ్చేసాడు.

మా V వాడికి చాలా సార్లు చెప్పి చూసాం -- story లు, philosophy లు ఎవరికీ పడితే వాళ్ళకు చెప్పొద్దని. వినిపించుకుంటే గా! ఇలా ఎంత మంది బలి అవుతారో count చెయ్యడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమి లేదు...

సెలవు,
*(@#$~^

మన V గడు చేసే కొన్ని చిలిపి పనులు....
  • Kingston ని Kingfisher అని చదువుతాడు... ఈ మాట ఆ కంపని ఓనరు గాని వింటే అక్కడే ఉరేసుకుని చస్తాడు...
  • Garnier Fructis ని Frootis అని చదువుతాడు... చిన్న పిల్లోడు ఎవరైనా వింటే shampoo ని cooldrink అనుకుని తాగేసినా తాగేస్తాడు...
  • Alpenliebe ని Olfenlabel అంటాడు

2 comments:

shashank said...

abey items avvarra rasindi na dantlo, a "V" gadu atu velli ongo mante nenu vellanu. BR nuvvu vellali.

vikasreddy said...

WTF!!
Nee account evaro hack chesuntarani naakanipistundi...
anavasaramga naaku chedda peru vasthe responsibility evaridi ? ;)